calender_icon.png 4 December, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ హవా

04-12-2025 12:18:19 AM

ఢిల్లీ ఎంసీడీ ఉప ఎన్నికల్లో పోటీ  చేసి.. ౭ చోట్ల గెలుపు

న్యూఢిల్లీ, డిసెంబర్ ౩: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. బుధవారం ఎన్నికల అధికారులు మొత్తం పది కేంద్రాల్లో ఓట్ల లెక్కిపు చేపట్టారు. అనంతరం విడుదలైన ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది.

మొత్తం 12 స్థానా ల్లో ఉప ఎన్నికలు జరగగా 7 చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఆప్ 3, కాంగ్రెస్ 1, ఫార్వర్డ్ బ్లాక్ 1 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ జరిగింది. కీలకమైన వార్డుల్లో బీజేపీ పెద్ద మెజారిటీతో గెలిచింది. ఉప ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయా రు.