28-06-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 27(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడా గ్రామ పంచాయతీ పరిధిలోని రాజుర గ్రామానికి వెళ్లే మార్గంలోని కల్వర్టు ఇటీవల కురిసిన వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయింది.
అటువైపుగా వెళ్ళే ప్రజలకు, వ్యవసాయదారులకు ఇబ్బందిగా మారిందని, వర్షకాలం వస్తే రోడ్డు పూర్తిగా బురద మయం కావడంతో పాటు రోడ్డు మార్గంలో ఉన్న కల్వర్టులు కొట్టుకపోవడంతో ప్రతి సం వత్సరం ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.