పపువా న్యూగినియాలో విరిగిపడిన కొండచరియలు
25-05-2024 01:23 AM
100 మందికి పైగా మృతి
న్యూఢిల్లీ, మే 24: పపువా న్యూగినియా దేశంలో కొండచరియలు విరిగిపడి 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని పోర్ట్ మోరెస్టీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌లోని కౌకలం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని ఆస్ట్రేలియా మీడి యా తెలిపింది. కొండచరియలు విరిగిపడడంతో కౌకలం గ్రామం మొత్తం ధ్వంసమైంది. ప్రజలు నిద్రలో ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్యను అధికారులు ధ్రువీకరించనప్పటికీ.. 100 మంది కంటే ఎక్కువగానే మరణించి ఉంటారని స్థానికులు వెల్లడించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. చాలా మృతదేహాలను బయటకు తీశా రు. భారీగా కొండచరియలు విరిగిపడడంతో సహాయ చర్యలకు కష్టంగా మారింది.






