15-05-2025 12:02:17 AM
మేడ్చల్, మే 14 (విజయక్రాంతి): పిల్లర్ కోసం తీసిన గుంతలో పడి అన్నదమ్ములు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో జరిగింది. గద్వాల జిల్లా కు చెందిన సుజాత దంపతులు జీవనోపాధి కోసం ఉప్పల్ వచ్చి, స్థానిక కురుమనగర్‌లో ఉంటూ, ఫ్లుఓవర్ బ్రిడ్జి ని ర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి మణికంఠ(15), అర్జున్(8) కుమారులు.
మంగళవారం తమ కుమారులు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. కాగా ఉప్పల్ భగాయత్‌లో కుల సంఘా ల భవన నిర్మాణానికి పిల్లర్ గుంతలు తీశా రు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుంతలో నీరు చేరింది. బుధవారం ఆ గుంతలోనే అర్జున్ మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత డీఆర్‌డీఎఫ్ సిబ్బంది గాలించగా మణికంఠ మృతదేహం కూడా బయటపడింది.