calender_icon.png 15 May, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఏకీకృత సర్వీస్ రూల్స్

15-05-2025 12:04:00 AM

  1. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి
  2. సీఎస్‌కు ఎమ్మెల్సీ మల్క కొమురయ్య వినతి

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును బుధవారం రాష్ట్ర సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏండ్ల తరబడి సమస్యలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురువుతున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు.

సుమారు రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందిస్తూ మండల విద్యాధికారి, డైట్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు కల్పించాలని కోరారు.

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, అన్ని యాజమాన్యాల పరిధిలోని గురుకుల పాఠశాలలు, కళాశాలలు, మోడల్ స్కూల్ బోధన, బోధనేతర సిబ్బందికి, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 ఆర్థిక పద్దు ద్వారా ప్రతినెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు.