calender_icon.png 15 May, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీమా రంగంలోకి ‘అపోలో 24/7’

15-05-2025 12:00:36 AM

  1. త్వరలో ‘హెల్త్-ఫస్ట్ క్రెడిట్ కార్డ్’ విడుదల
  2. ఆరోగ్య సంరక్షణకు ‘అల్టిమేట్ హెల్త్ ప్రోగ్రామ్’

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): పోలో హెల్త్‌కోకు చెందిన అపోలో 24/7 ఇప్పుడు ఇన్సూరె న్స్ రంగం లో కూడా సేవలు అందించనుంది. నాణ్యమైన ఆరోగ్య సేవలు మరింత మందికి అందించాలన్న లక్ష్యంతో బీమా రంగంలో అడుగు పెట్టామని అపోలో హెల్త్‌కో సీఈవో మాధివనన్ బాలకృష్ణ న్ తెలిపారు. బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్‌కృష్ణలో బుధవారం మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు.

త్వరలోనే హెల్త్, లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులోకి రానున్నాయన్నారు. అపో లో హెల్త్‌కో వినియోగదారుల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన ఇన్సూరెన్స్ ప్లాన్లు అందించడమే అపోలో 24/7 లక్ష్యమన్నారు. రాబోయే రెండు నెలల్లో 12 బీమా సంస్థల నుంచి బీమా ఉత్పత్తులను ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో ఓపీడీ (ఔట్‌పేషెంట్) కవర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నామన్నారు.

మొదటి ఏడాదిలో రూ.80 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భారతదేశపు మొదటి ‘హెల్త్-ఫస్ట్ క్రెడిట్ కార్డ్’ త్వరలో విడుదల కా నుందని చెప్పారు. ముంద స్తు ఆరోగ్య పరీక్షలను ప్రో త్సహించేందుకు ’అల్టిమేట్ హెల్త్ ఛాలెంజ్’ ప్రారంభించామని తెలిపారు. డాక్టర్ కన్సల్టేషన్లు, డయాగ్నొస్టిక్స్, మెడిసిన్ డెలివరీ, వెల్నెస్ వంటి సేవలను సమగ్రంగా అందిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో 900 పైగా అపోలో ఫార్మసీ స్టోర్లు కలవన్నారు. ఇందులో 500 పైగా స్టోర్లు హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరికి సరైన ఆరోగ్య బీమా ఎంపిక చేసుకోవడంలో సహాయపడనున్నామని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ ఖర్చులు తగ్గించడం, చెల్లింపుల సౌలభ్యాన్ని పెంచడంలో భాగంగా అపోలో 24/7 భారతదేశపు మొదటి ‘హెల్త్-ఫస్ట్ క్రెడిట్ కార్డ్’ రాబోయే రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్డ్ ద్వారా మిలియన్ల మంది వినియోగదారులు ఆరోగ్య సేవలు మరింత సులభంగా పొందగలుగుతారని చెప్పారు. ’అల్టిమేట్ హెల్త్ ప్రోగ్రామ్‌లో భాగంగా ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న తర్వాత అన్ని ఫలితాలు సానుకూలంగా వస్తే వినియోగదారులకు హెల్త్ ప్యాకేజ్ ఖర్చును 100 శాతం తిరిగి ఇవ్వనున్నామన్నారు.