calender_icon.png 12 February, 2026 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఎన్‌జె ఆస్పత్రిలో అన్న దానం

12-02-2026 12:43:23 AM

హైదరాబాద్, ఫిబ్రవరి (విజయక్రాంతి): ఎంఎన్‌జె క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న రోగులకు, వారి సహాయకులకు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేనీ (ముజీబ్) బుధవారం అన్నదానం చేశారు. అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి వారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ సేవలో భాగంగా, ఈ వా రం కూడా డాక్టర్ ముజీబ్  రోగులకు భోజ నం పంపిణీ చేశారు.

అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ కోశాధికారి అసదుద్దీన్, తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, టీఎన్‌జీఓ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు కెఆర్‌రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ శంకర్, ప్రచార కార్యదర్శి శ్రీవైదిక శాస్త్ర, ఎం ఎన్‌జె క్యాన్సర్ ఆస్పత్రి యూనిట్ ప్రెసిడెంట్ బి శివకుమా ర్, కార్యదర్శి చంద్రశేఖర్, ఉస్మాన్ అలీ ఉ స్మాని, హైదరాబాద్ జిల్లా ఏపీఆర్వో మహ్మ ద్ వహీద్, మహ్మద్ ముస్తాఫా పాల్గొన్నారు.