13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

అకాల వర్షం కుభీర్ ను కుదిపింది… రైతుల కష్టార్జితం నేలమట్టం

31-03-2026 10:51 AM

పంటలు నేలమట్టం, రైతులపై అప్పుల భారము

కుభీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో(Kubeer Mandal) సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు భారీ నష్టం మిగిల్చింది. కోత దశకు చేరుకున్న జొన్న, మొక్కజొన్న పంటలు గాలులతో కలిసి నేలకూలిపోయాయి. పంట(Crop Damage) చేతికొస్తుందని ఆశించిన సమయంలోనే ప్రకృతి విరుచుకుపడటంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పులు చేసి సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతినడంతో ఆర్థికంగా కుదేలయ్యారు. స్థానిక అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని రైతులు(Farmers) కోరుతున్నారు. తక్షణ నష్టపరిహారం ప్రకటించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనతో మండలంలోని పలు గ్రామాల్లో రైతులు నిరాశలో మునిగిపోయారు.