10 April, 2026 | 3:41 AM

బీఆర్‌ఎస్, బీజేపీ ఎప్పటికైనా కలుస్తాయి

10-04-2026 01:44 AM

మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదు 

జీవన్‌రెడ్డికి పార్టీ 14 సార్లు బీఫామ్ ఇచ్చింది 

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్, బీజేపీ వేర్వేరు కాదని ఈ రెండు పార్టీలు ఎప్పటికైనా కలుస్తాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఎవరు బాగుపడ్డది లేదన్నారు. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని ఆయన పేర్కొన్నారు.

గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మంత్రులపై ఆరోపణలు సరికాదన్నారు. హరీశ్ రావు వద్ద ఆధారాలుంటే తీసుకురావాలన్నారు. తమ ప్రభుత్వ హయాం లో నిర్మించిన  ప్రాజెక్టులకు ఇప్పటివరకు ఎక్కడ గీత కూడా పడలేదని, అదే మీరు కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలిపోయిందని మండిపడ్డారు. మంత్రి పొంగులేటిపై ఆధారాలుంటే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

పసలేని ఆరోపణలు చేయవద్దని, నాదర్‌గుల్ భూముల కుంభకోణం బీఆర్‌ఎస్ హయంలోనే జరిగిందని ఆరోపించారు. మా మీద బట్ట కాల్చి వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బి-ఫామ్ ఇచ్చిందని, పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళాలన్నారు. జీవన్‌రెడ్డి విమర్శలు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేర న్నారు. సీఎం రేవం త్‌రెడ్డి పోవాలని చెప్పడానికి జీవన్‌రెడ్డి ఎవరని ప్రశ్నించా రు.  కాంగ్రెస్‌ను విమర్శించే ముందు జీవన్‌రెడ్డి గతంలో బీఆర్‌ఎస్‌పై చేసి న విమర్శలను గుర్తు తెచ్చుకోవాలన్నారు. 

విద్యార్థి రాజకీయాలు.. భవిష్యత్ నాయకత్వానికి పునాది.. 

ఎన్‌ఎస్‌యూఐ 56వ ఆవిర్భావదినోత్సవం వేడుకలను గాంధీభవన్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన  పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు అనేక మంది  ఎన్‌ఎస్‌యూఐ ద్వారానే ఎదిగారని తెలిపారు. అందులో తనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, వంశీ చంద్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎస్సీ సెల్ చైర్మన్ శంకర్ నాయక్ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్లమేనన్నారు. సమాజంలో ఏ విప్లవాత్మక మార్పు రావాలన్నా అందుకు విద్యార్థి దశలో ఉద్యమమే తొలి అడుగన్నారు.