10 April, 2026 | 3:44 AM

ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లోనూ ముఖ గుర్తింపు హాజరు

10-04-2026 01:42 AM

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీలే కాకుండా ప్రైవే ట్ డిగ్రీ కాలేజీల్లోనూ ముఖ గుర్తింపు ఆధారిత హాజరు వ్యవస్థను తప్పనిసరిగా రాబోయే విద్యా సంవత్సరం అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. గురువారం వీసీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాన్‌దోస్త్ కాలేజీలు దోస్త్‌లోకి రావాల ని ఆదేశాలు జారీ చేశారు.

దోస్త్ పరిధిలో రాని కాలేజీలకు దోస్త్ కన్వీనర్ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఇంటర్ ఫలితాలు విడుదలైన మరుసటి రోజే దోస్త్ నోటిఫి కేషన్ జారీ చేయనున్నారు..