15-10-2025 06:26:06 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల నచ్చి బిజెపి పార్టీలో బుధవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్, నసురుల్లాబాద్ కు చెందిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు బుధవారం బిజెపి పార్టీలో చేరారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఎండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు. వారిని గౌరవంగా స్వాగతిస్తూ పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. బిర్కూరు మండలం నుంచి రైతు నగర్ గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేష్, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ అలాగే కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చినరాజులు ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరడం జరిగిందన్నారు.
వారితోపాటు మాజీ వార్డ్ మెంబర్ నర్సా గౌడ్, అన్నారం మాజీ ఉపసర్పంచ్ మొగులయ్య, బుక్కారెడ్డి, మాల్గొండ, మహేంద్ర, ప్రసాద్, శివరాజ్ అలాగే వీరితో పాటు మరో 30 మంది యువత భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసే ఈరోజు బీజేపీలో నాయకులు యువత ప్రజలు బిజెపిలో చేరడం జరుగుతుందని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల లో బిజెపిని బలోపేతం చేస్తూ అధిక జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, వార్డ్ నెంబర్లను గెలుచుకోవాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని అన్నారు. దేశ ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని వచ్చే ఎన్నికల్లో జెడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు, వార్డ్ నెంబర్లను అధిక మొత్తంలోబిజెపి గెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు నాగేల్ల సాయికిరణ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు చిదుర సాయిలు,మండల మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, మాజీ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, మండల ప్రధాన కార్యదర్శిలు శ్రీనివాస్, యోగేష్, అలాగే బాన్సువాడ టౌన్ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.