15-10-2025 06:29:37 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని కాకతీయ కళాశాలలో సీపీఆర్‌పై బుధవారం అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఆర్ చేయడం వలన చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. సీపీఆర్ గురించి విద్యార్థిని విద్యార్థులు తెలుసుకొని, ప్రజలకి అవగాహన కల్పించాలన్నారు. చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ తులసీదాసు, హెల్త్ ఎన్స్పెక్టర్ ప్రతాప్, కళాశాల ప్రిన్సిపాల్ వేణుమాధవ్, డైరెక్టర్లు రాజేశ్వర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ప్రకాష్ రెడ్డితో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.