calender_icon.png 15 October, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

15-10-2025 06:22:44 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని ఎంజెపి బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సుకన్య అన్నారు. బుధవారం గురుకుల పాఠశాల విద్యార్థులకు బెడ్ షీట్, ప్లేట్స్, గ్లాసులతో కూడిన కిట్టును అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత స్థానానికి ఎదిగేలా కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకులం పాఠశాల ఉపాధ్యాయురాలు, సిబ్బంది పాల్గొన్నారు.