15 April, 2026 | 10:38 AM

చీరల పంపిణీకి బీఆర్‌ఎస్ యత్నం

17-12-2025 01:12 AM
  1. అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు 
  2. వనపర్తి జిల్లా పాన్‌గల్‌లో ఘటన

వనపర్తి, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బీఆర్‌ఎస్  నాయకులు చీరలను పంచేందుకు యత్నించగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నేత రమేష్‌రెడ్డి ఇంటి వద్ద ఆ పార్టీ నేతలు రమేష్‌రెడ్డి, నరేష్‌రెడ్డి, నవీన్‌రెడ్డి.. మంగళవారం ఓటర్లకు చీరలు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. రమేష్‌రెడ్డి ఇంటి వద్ద దాదాపు 5వేల చీరలు ఉండటంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ నేత తిరుపతిరెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.