రఘుకు మద్దతుగా తరలిన బీఆర్‌ఎస్ శ్రేణులు
గరిడేపల్లి, ఏప్రిల్ 26 : ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు బిఆర్‌ఎస్ పార్టీలో చేరటాన్ని స్వాగతిస్తూ ఆయనకు మద్దతుగా గరిడేపల్లి మండలం నుంచి నాయకులు,కార్యకర్తలు ఆదివారం భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల బి ఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ రఘు నేతృత్వంలో నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.
తరలి వెళ్లిన వారిలో మండల పార్టీ అధ్యక్షులు, బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు పోలంపల్లి ఆనంద్ బాబు గౌడ్, గుగులోతు కృష్ణ నాయక్,హుజూర్నగర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుగులోతు హేమ్లా నాయక్,, మాజీ సర్పంచ్ రామకృష్ణ, సందీప్ నాయక్, మండల యువజన సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు, గాయకుడు నరసింహ, రవీందర్ నాయక్, బాలు నాయక్,నరేందర్ నాయక్, కోటయ్య,రామయ్య,అనిల్, ఈశ్వర్, గోవిందరెడ్డి,రాములు తదితరులు ఉన్నారు.






