calender_icon.png 28 January, 2026 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ వేసిన బిఆర్ఎస్ చైర్ పర్సన్ అభ్యర్థి నర్సింహులు

28-01-2026 07:52:51 PM

పార్టీలు మారుతున్న కౌన్సిలర్ అభ్యర్థులు

తాండూరు,(విజయక్రాంతి): పురపాలక సంఘం ఎన్నికల ఘట్టంలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం బుధవారం నుండి ప్రారంభమైంది. నేడు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మొట్టమొదటి నామినేషన్ పత్రాన్ని టిఆర్ఎస్ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించిన సైపూర్ పట్లోళ్ల నర్సింలు దాఖలు చేశారు.

కాంగ్రెస్, టిఆర్ఎస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు మొత్తంగా 11 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ యాదగిరి తెలిపారు.ఇక భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి చింటుపల్లి వెంకట్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్  నుండి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాథోడ్ భీమ్ సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయనున్నారు.నామినేషన్ల ఘట్టం పూర్తయ్య వరకు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తేలిపోనుంది.