28-01-2026 07:49:17 PM
మోతె,విజయక్రాంతి: ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహనతో సమస్యలన్ని పరిష్కారం అవుతాయని, యంఇఓ కె. గోపాల్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు సర్వారం, కూడలి, గ్రామాలలో జిల్లా లీగల్ సర్వీస్ ఆధారిటి ఆధ్వర్యంలో జిల్లా పరిష్యత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
పిల్లలకు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారంగా ఆడ పిల్లలకు 18 సంవత్సరాల వయస్సు మగ పిల్లలకు 21 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాతే పెళ్ళిలు చేయాలని కోరారు. లేదంటే వయసు లేని పిల్లల పెళ్లిలకు ఎవరు సహకరించిన శిక్ష తప్పదని హెచ్చరించారు. తల్లి దండ్రులు మైనార్ డ్రైవింగ్ కు సహకరిస్తే జైలు పాలు కాక తప్పదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సర్వారం సర్పంచ్ మూడు నగేష్, కూడలి మోతె ఉప సర్పంచ్ లు సంధ్య ఉపేందర్ రెడ్డి, జిల్లా లీగల్ సర్వీస్ అదారిటి జిల్లా ప్యారా లీగల్ వాలెంటర్స్ జటంగి సమనయ్య గుద్దేటి వెంకన్న, పల్లెల లక్ష్మణ్, యస్. కృష్ణవేణి ఉపాధ్యాయులు ఉస్మాన్, వెంకన్న, వెంకట్ రెడ్డి, ముంత శ్రీను,వార్డ్ సభ్యులు వీరబాబు, తరుణ్, రమేష్, విజయ, అంగన్వాడీ టీచర్లు పద్మ, పార్వతి, మల్లికా, ఆశ కార్యకర్తలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.