ఎమ్మెల్యేలు పోచారం, సంజయ్ కుమార్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు
26-06-2024 02:49 PM
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ లపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోచారం, సంజయ్ సభ్యత్వాలు రద్దు చేయాలని బీఆర్ఎస్ కోరింది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనర్హత పిటిషన్ దాఖలు కోసం సభాపతి సమయం కోరారు. ఇప్పటివరకు సభాపతి సమయం ఇవ్వలేదని తెలిపారు. దీంతో సభాపతికి మెయిల్, స్వీడ్ పోస్టు ద్వారా అనర్హత పిటిషన్ పంపినట్లు జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.






