విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్
26-06-2024 03:04 PM
హైదరాబాద్: విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ సాయం పొందుతున్న ఇతర ఉన్నత విద్యాసంస్థలు దివ్యాంగులకు 5శాతం సీట్లు ఇవ్వాలని జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఐదేళ్ల గరిష్ఠ వయోపరిమితి సడలిస్తూ దివ్యాంగుల శాఖ కార్యదర్శి కరుణ ఆదేశాలు జారీ చేశారు.






