06-11-2025 04:27:43 PM
ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
గజ్వేల్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ మేరీస్ విద్యానికేతన్ పాఠశాలలో సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఏర్పాటుచేసిన సైన్స్ ఎక్స్పోను సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల 2001 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలో పాఠశాల ఏర్పాటు చేసి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులు అన్ని సబ్జెక్టులపైన ప్రాజెక్టులను తయారు చేసి విద్యార్థులలో ఉన్న సృజనాత్మక శక్తిని తెలియజేస్తూ ప్రాజెక్టులను తయారు చేయడం ఎంతో గర్వకారణం అన్నారు.
విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యజమాన్యం విద్యార్థులకు బోధన విధానంలో మార్పులు చేస్తూ మంచి విద్యను అందిస్తున్న పాఠశాల యజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను చూసి విద్యార్థులను అభినందించారు. ప్రతి విద్యార్థిలో ప్రతిభ ఉంటుందని ఆ ప్రతిభను వెలికి తీయడమే ఉపాధ్యాయుల బాధ్యత అని తెలియజేస్తూ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న పాఠశాల యజమాని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ, పాఠశాల కరస్పాండెంట్ గోపు ఇన్నా రెడ్డి డైరెక్టర్ థామస్ రెడ్డి, ట్రస్మ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సోమేశ్వర్ రెడ్డి వివిధ పాఠశాల కరస్పాండెంట్లు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.