15 May, 2026 | 4:49 AM

కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు

23-04-2024 01:54 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్‌ఎస్ ప్రాతినిథ్యం కోల్పోయింది. పార్టీలో ఉన్న మరో 11 మంది కార్పొరేటర్లు కారు దిగి హస్తం గూటికి చేరారు. ఇప్పటికే కార్పొరేషన్‌లో నలుగురు కార్పొరేటర్ కారు దిగగా సోమవారం మరో 11మంది కాంగ్రెస్  కండువా కప్పుకున్నారు. బండ్లగూడ జాగీర్‌మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్ కాంగ్రె స్ సీనియర్ నాయకుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి వారికి ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో శక్తివంచన లేకుండా పని చేస్తామన్నారు.