15 May, 2026 | 6:08 AM

టెట్‌కు 48 వేల మంది టీచర్ల దరఖాస్తు

23-04-2024 01:53 AM

l పదోన్నతులకు టెట్ తప్పనిసరి కావడమే కారణం

l పేపర్ 9,756 మంది

l పేపర్ 38,826 మంది దరఖాస్తు

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు ప్రభుత్వ టీచర్లు (ఇన్‌సర్వీస్ టీచర్లు) మొత్తం 48,582 మంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యా హక్కు చట్టం, ఎన్‌సీటీఈ(నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) నిబంధనల ప్రకారం టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం టెట్‌కు వచ్చిన 2,86,386 దరఖాస్తుల్లో 48,582 మంది టీచర్లు ఉన్న ట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. పేపర్ 9,756, పేపర్ మ్యాథమెటిక్స్‌కు 22,369, సోషల్ స్టడీస్‌కు 16,457 మంది దరఖాస్తు చేసు కున్నారు. అయితే సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ) స్కూల్ అసిస్టెంట్లు(ఎస్‌ఏ)గా, స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా పదోన్నతి పొందాలంటే పేపర్ 2లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. ఎల్‌ఎఫ్‌ఎల్ (లో ఫిమేల్ లిటరసీ) ప్రైమరీ స్కూల్‌లో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పోస్టు కు టెట్ పేపర్ ఎస్జీటీలు ఉత్తీర్ణత సాధించాలి.