కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్
మెదక్, మార్చి 6 (విజయక్రాంతి): మెదక్ పట్టణంలోని 16వ వార్డు కౌన్సిలర్ అవారి రాజశేఖర్ బిఆర్‌ఎస్ పార్టీలో నుంచి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల కౌన్సిలర్లు, నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సానుకూలంగా ఉన్నారని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలోనే పేద ప్రజల బతుకులు మారుతాయన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం వల్ల ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పట్టణం అభివృద్ధి చెందాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమన్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తామని అన్నారు.




