కేసీఆర్‌కు నాచగిరి బ్రహ్మోత్సవాల ఆహ్వానం
07-03-2026 01:48 AM
గజ్వేల్, మార్చి 6: ఈనెల 8వ తేదీ నుండి జరగనున్న వర్గల్ మండలం నాచగిరి శ్రీ లక్ష్మీనరసిం హస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ పాలకమండలి అధికారులు శుక్రవారం మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కెసిఆర్‌కు అందజేశారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నాచగిరి పాలకమండలి చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఈవో రంగాచారి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కెసిఆర్‌కు స్వామివారి శేష వస్త్రము, ప్రసాదము, అర్చకులచే వేద ఆశీర్వాదం ఇచ్చారు. కెసిఆర్‌తో పాటు సిద్దిపేట, దుబ్బాక ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డిలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.




