7 March, 2026 | 6:16 AM

‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’కు కేటీఆర్‌కు ఆహ్వానం

07-03-2026 01:51 AM

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి) : మార్చి 13, 14 తేదీల్లో న్యూఢి ల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్ సదస్సులో ప్రసంగించాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం అం దింది. ఈ మేరకు ఇండియా టుడే గ్రూ ప్ వైస్ చైర్ పర్సన్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్- ఇన్ -చీఫ్ కల్లి పూరీ శుక్రవారం కేటీఆర్‌కు లేఖ రాశారు.

తెలంగాణ రాష్ట్ర పాలనా నమూనాను రూపొందించడంలోనూ, రాష్ట్రాన్ని సాంకేతికత, ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడంలో కేటీఆర్ చూపిన నాయకత్వం ఈ సదస్సుకు ఎంతో సందర్భోచితంగా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.