జేబీఎస్ వద్ద కారు బీభత్సం.. మూడు పల్టీలు కోట్టిన కారు
06-06-2024 12:21 PM
హైదరాబాద్: సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. సిగ్నల్ వద్ద వేగంగా వెళ్తూ కారును ఢీకొట్టి మరో కారు పల్టీ కొట్టింది. కారులోని ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. కారు మూడు పల్టీలు కొట్టినట్లు తెలుస్తోంది. కారులో చిక్కుకున్న వారిని పోలీసులు బటయకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






