calender_icon.png 20 August, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లీగల్‌టీంల ఏర్పాటుపై బీఆర్‌ఎస్ దృష్టి

20-08-2025 12:00:00 AM

జిల్లాకు ఐదుగురిని ఎంపిక చేయాలని నిర్ణయం

కరీంనగర్, ఆగస్టు 19 (విజయ క్రాంతి): ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యకర్తలపై, నాయకులపై నమోద వుతున్న కేసులను ఎదుర్కొనేందుకు లీగల్ టీంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిం ది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు నిర్ణ యం మేరకు ప్రతి జిల్లా నుండి ఐదుగురిని ఎంపిక చేయాలని నిర్ణయించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంతోపా టు సోషల్ మీడియా వారియర్స్ ను ఇందు కు ఉపయోగించుకోవడంతోపాటు వివిధ పోస్టింగ్ లు చేసిన సందర్భంలో కేసులు నమోదైతే వాటిని న్యాయపరంగా ఎదుర్కోవడం అలాగే ఇతరత్రా కేసుల విషయంలో కార్యకర్తలకు మనోధైర్యం నింపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లా నుం డి ఐదుగురిని ఎంపిక చేసే విషయంలో క్రమం తప్పకుండా కోర్టుకు హాజరవుతున్న సీనియర్ న్యాయవాదులను ఎంపిక చేసే బా ధ్యతను ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులకు అప్పగించారు.

ఈ క్రమంలో కరీంనగర్ జి ల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సుడా మాజీ చైర్మన్ జీవి రామకృష్ణారావు మంగళవారం న్యాయవాదులతో సమావేశమైన లీగల్ టీంల ఏర్పాటు అంశాన్ని చర్చించారు. పార్టీ కి సంబంధించిన వారితోపాటు క్రిమినల్ కేసులు ఇతరత్రా కేసుల్లో అనుభవం ఉన్న న్యాయవాదులను ఈ టీంలో ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

 న్యాయవాది అయిన జీవీ రామకృష్ణారావు కరీంనగర్ జిల్లా విషయంలో 10 మంది సీనియర్ల పేర్లను కేటీఆర్ కు పంపించాలని నిర్ణయించారు. ఇందులోనుండి ఐదుగురిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ నెల 23న జిల్లాల వారీగా తెప్పించిన జాబితాలను ఫైనల్ చేసి లీగల్ టీంలను ఏర్పాటు చేయనున్నారు.