20-08-2025 12:49:08 AM
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు విచారణ అర్హత లేదని, కమిషన్ నివేదికను కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కమిషన్ తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోరు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నది.
గత ఏడాది మార్చి 14న కమిషన్ ఏర్పాటు
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్‌గా జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించింది. ఘోష్ కమిషన్ దాదాపు 16 నెలలపాటు నాటి సీఎం కేసీఆర్, అప్పటి సాగునీటి, ఆర్థిక శాఖ మం త్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఐఏఎస్‌లు, ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థలు, ప్రజా సం ఘాలను విచారించి సమాచారాన్ని సేకరించింది. గత నెల 31న నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. అనంతరం కమిషన్ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది.