ఉత్సాహంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆసిఫాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి తనయుడు, యువ నాయకుడు కోవ సాయినాథ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గత రెండున్నర దశాబ్దాల్లో పార్టీ సాధించిన విజయాలు, తెలంగాణ రాష్ట్ర సాధన, రాష్ట్ర అభివృద్ధిలో బిఆర్ఎస్ పాత్రను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, గుండి సర్పంచ్ జబరి రవీందర్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎం.డి. అహ్మద్, నాయకురాలు మర్సకోల సరస్వతి, మాజీ సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, కుర్సెంగ బాలకృష్ణ, సర్పంచ్ బుర్స పోచయ్య, ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి , నాయకులు నిస్సార్, ఆన్సర్, జీవన్, సాయి శ్రవణ్, పొన్నాల నారాయణ, బలరాం నాయక్, దూడల అశోక్, ప్రేమ్ కుమార్, నారా ఆశన్న, గిరి,రవి తదితరులు హాజరయ్యారు.






