నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులు పూర్తిచేయాలి
19-08-2026 12:33 AM
ఎమ్మెల్యే పద్మావతి
కోదాడ ఆగస్టు 18: నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులు పూర్తిచేయాలని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పద్మావతి పరిశీలించి, అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ నాణ్యతలో రాజీ పడవద్దని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అదే విధంగా పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఆర్ అండ్ బి భవనం, డివిజన్ ఆఫీస్ పనులను పరిశీలించారు. మున్సిపల్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్భార్ నిర్వహించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంధాలయం చైర్మన్ వంగవీటి రామారావు,డాక్టర్ దశరథ్ , కమిషనర్ రమాదేవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






