ఎరువుల షాపులు బంద్
27-04-2026 12:37 PM
మహబూబాబాద్, (విజయక్రాంతి): ఎరువులపై రవాణాచార్జీలు తగ్గించాలని, లింకులు లేకుండా యూరియా, కాంప్లెక్స్ ఎరువులు డీలర్లకు అందించాలని రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు మహబూబాబాద్ జిల్లాలో సోమవారం ఎరువుల షాపుల డీలర్లు షాపులు బందు చేసి నిరసనకు దిగారు. ఎరువుల ఉత్పత్తిదారులు రవాణా చార్జీల భారం మోపడం వల్ల రైతులకు ఎమ్మార్పీకి ఎరువులు విక్రయించే పరిస్థితి లేకుండా పోయిందని, లింకులు పెట్టి ఎరువులు ఇవ్వడం వల్ల ఇబ్బంది కలుగుతుందని ఎరువుల డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలాల తహసిల్దార్ లకు వినతి పత్రాలు అందజేశారు.






