మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు
17-12-2024 01:26 AM
- జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష
- ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్
- షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫస్టి యర్, సెకండియర్ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ సోమవారం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు షెడ్యూలు విడుదల చేసింది. జనవరి 29న విద్యా ర్థులకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జరుగనున్నది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు విద్యార్థులకు ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరుగనున్నాయి.







