ఓట్లు అడిగే హక్కు బీఆర్‌ఎస్‌కే ఉంది

29-04-2024 01:26:32 AM

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 

పటాన్‌చెరు, ఏప్రిల్ 28 : అమలుకు సాధ్యం కాని హామీలు ప్రకటించి అధికా రం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వాటిని అమలు చేయలేక తప్పించుకుంటోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అంటేనే సాధ్యం కాని హామీలకు చిరునామాగా మారిందని ఎద్దేవా చేశారు. శనివారం రాత్రి బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డికి మద్దతుగా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీగార్డెన్స్‌లో రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్ల మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. సమావేశానికి శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమర్థుడు, పరిపాలనదక్షత కలిగిన రిటైర్డ్ ఐఎఎస్ వెంకట్రాంరెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారని, ఇలాం టి వ్యక్తిని పార్లమెంట్‌కు పంపిస్తే అభివృద్ధిని సుసాధ్యం చేస్తారని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల నుంచి కాంగ్రెస్ తప్పించుకుంటుందని పేర్కొన్నారు. రాబో యే 12రోజుల పాటు రెండు డివిజన్ల పరిధిలోని కార్యకర్తలందరూ గడపగడపకూ వెళ్లి గత పదేండ్లలో చూసిన అభివృద్ధిని వివరించడంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరించాలని కోరారు. ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కేవలం బీఆర్‌ఎస్‌కే ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధూఆదర్శ్‌రెడ్డి, పుష్పానగేశ్,  మాజీ కార్పొరేటర్ అంజయ్యయాదవ్, పార్టీ సర్కి ల్ అధ్యక్షుడు పరమేశ్, భారతీనగర్ డివిజన్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, సీనియర్ నాయకులు కుమార్‌గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.