calender_icon.png 4 December, 2024 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ యువత ఆశయాలను విస్మరించింది

01-08-2024 08:06:25 PM

రంగారెడ్డి: యువత ఆశయాలను గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు యువత, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిందని, స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరామన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంతకు మించిన సంతృప్తి కలిగించే అంశం మరొకటి లేదని, తెలంగాణ సాధించుకునేందుకు యువత ఎంతో పోరాటం చేసిందని ఈ సందర్బంగా గుర్తు చేశారు.

యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాలు పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు యువతలో పెరగాల్సిన అవసరం ఉందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించలేదని డిప్యూటీ సీఎం చెప్పారు. ప్రజల భూములు సేకరించి ఫార్మా కంపెనీలకు అమ్ముకోవాలని చూసినట్లు భట్టీ ఆరోపించారు. ఒకే చోట భారీ స్థాయిలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యానికి ముప్పు అని, భూములు కోల్పోయిన వారికి మంచి జరగాలి కానీ... చెడు జరగవద్దని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజల ఆరోగ్యం ఏమై పోయినా పర్వాలేదని గత ప్రభుత్వం భావించిందన్నారు. మొత్తం ఫార్మా సీటీ నిర్మిస్తే ఇక్కడ జనజీవనానికి కష్టమవుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఫార్మా మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయం ఉండాలని మేం భావించామని, ఎవరైనా ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని ఉండేలా కందుకూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారని  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.