12 August, 2026 | 1:35 AM

శిఖండి రాజకీయాలు చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు

12-08-2026 12:00 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, ఆగస్టు 11 (విజయ క్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలోని ప్రాజెక్టుల ను పూర్తి చేసి సాగునీరు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే ప్రాజెక్టు పనులను అడ్డుకుంటూ బిఆర్‌ఎస్ నాయకులు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. మంగళవారం గంగాధర మండలం మధురానగర్ వద్ద నారాయణపూర్ కుడికాలువను ఎమ్మెల్యే పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపూర్ కుడి కాలువను 2004 లో కాం గ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి 90 శాతం ప నులను పూర్తి చేసిందని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో కుడి కాలువలో తట్టె డు మట్టి తీయలేదని ఎద్దేవ చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నారాయణపూ ర్ రిజర్వాయర్ క్రింద భూసేకరణ కోసం 23.50 కోట్లు, రిజర్వాయర్ అభివృద్ధి, కుడి ఎడమ కాలువల పూర్తి కోసం మరో 20 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు.

ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా నారాయణపూర్ ప్రాజెక్టుతో పాటు, అసంపూర్తిగా ఉ న్న కాలువలను పూర్తి చేసి గంగాధర మం డలం తో పాటు, బోయినపల్లి మండలానికి సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఈ సుమతి దేవి, ఎస్ ఈ సంత ప్రకాష్, ఈఈ బాలకృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంత్రి మహేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, మాజీ జెడ్పిటిసి సత్తు కనకయ్య, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు ముద్దం నగేష్, సర్పంచులు రామిడి రాజిరెడ్డి, పడాల భాగ్యలక్ష్మి రాజన్న, వేముల భాస్కర్, రాచమల్ల రవి, బీర్ల ఆనంద్, బాసవేని శ్రీనివాస్, గుండవేని లావణ్య తిరుపతి, కోలేపాక కవిత మల్లేష్, గుండెల్లి పద్మ మల్లేష్, ఆరే తేజశ్రీ రాజశేఖర్, గుడి రజిని ప్రవీణ్ రెడ్డి, చిందం ఆంజనేయులు, కడారి రేణుక కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.