12 August, 2026 | 2:45 AM

మొయినాబాద్‌లో మార్మోగిన దేశభక్తి నినాదాలు

12-08-2026 12:00 AM

జాతీయ జెండాలతో కదం తొక్కిన యువత.. 

మొయినాబాద్ ఆగస్టు 11 (విజయ క్రాంతి):  హర్ ఘర్ తిరంగా జాతీయ అభియానంలో భాగంగా బీజేపీ మొయినాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు చేతబూనిన విద్యార్థులు, యువత, పార్టీ నాయకు లు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సం ఖ్యలో పాల్గొనడంతో మొయినాబాద్ దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకాలతో దేశభక్తిని చాటారు.

రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు కుండే గణేష్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రాష్ట్ర సీనియర్ నాయకుడు ప్రకాష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్రెడ్డి, డాక్టర్ కావలి శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మమత, జిల్లా ఉపాధ్యక్షు డు ఇంద్రారెడ్డితో పాటు మండలంలోని స ర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. 

ప్రతి ఇంటా జాతీయ జెండా

ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని నాయకులు పిలుపునిచ్చారు. జాతీయ జెండాపై గౌరవం, దేశ సమైక్యత, ఐక్యత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని బీజేపీ మం డల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్యాదవ్, తిరంగా ర్యాలీ అసెంబ్లీ కన్వీనర్ నందకిషోర్, మండల కన్వీనర్ మహేందర్, కో-కన్వీనర్ రామకృష్ణ సమన్వయం చేశారు.