‘చేయూత పింఛన్’ కొత్త దరఖాస్తులకు ఆహ్వానం
12-08-2026 12:00 AM
మేడిపల్లి, ఆగస్టు 11 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల నుంచి కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజ తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ,
ఆగస్టు 31వ తేదీ వరకు చేయూత పింఛన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చేయూత పింఛన్ పథకానికి సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, ఇతర పూర్తి వివరాల కోసం బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ను సంప్రదించాలని, నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.






