15 April, 2026 | 5:48 AM

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం

01-02-2026 07:14 PM

- ఏఐఎఫ్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్

ముకరంపుర,(విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని అల్ ఇండియా  ఫార్వర్డ్  బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మోడీ ప్రభుత్వం తన ఆర్థిక సార్వభౌమత్వాన్ని బాహ్య ఒత్తిళ్లకు, ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా నుండి వచ్చిన ఒత్తిళ్లకు లొంగిపోయిందని తెలుస్తుందని పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం నిధులను తీవ్రంగా తగ్గించడం గ్రామీణ కుటుంబాలకు జీవనాధారాన్ని కూల్చివేయవడమేనని తెలిపారు. దేశ జిడిపికి నిజమైన సృష్టికర్తలైన కార్మికులు, ఉద్యోగుల చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడంలో ఈ బడ్జెట్ పూర్తిగా విఫలమైందన్నారు. ఇది ప్రజా, కార్మిక, రైతు, సమాఖ్య వ్యతిరేక బడ్జెట్ అని పేర్కొన్నారు.