calender_icon.png 2 December, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోట్ల ప్రజాధనం కొల్లగొట్టేందుకు కుట్ర

02-12-2025 10:53:26 AM

బీఆర్ఎస్ పోరుబాట

హైదరాబాద్: హిల్ట్ భూముల వ్యవహారంలో బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. హిల్ట్ పాలసీతో(Hilt policy) కలిగే నష్టాన్ని బీఆర్ఎస్ నేతలు ప్రజలకు వివరించనున్నారు. పారిశ్రామికవాడల్లో పర్యటించేందుకు ఎనిమిది నిజనిర్ధారణ బృందాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. విలువైన భూములను తక్కవ ధరకు కట్టబెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. హిల్ట్ పాలసీ పేరుతో రూ. 5 లక్షల కోట్లు ప్రజాధనం కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రేపు, ఎల్లుండి పారిశ్రామికవాడల్లో పార్టీ బృందాలు క్షేత్రస్థాయి పర్యటించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.