02-12-2025 10:34:48 AM
హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లా ఎస్టీ వసతిగృహంలో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే స్పందించిన హాస్టల్ అధికారులు విద్యార్థులను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలుషిత ఆహారమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితిని పరిశీలిస్తున్న వైద్యులు ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.