18 April, 2026 | 2:26 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

21-06-2025 08:23 AM

అదుపులోకి తీసుకున్న వరంగల్ సుబేదారి పోలీసులు 

సీఎం రేవంత్, మంత్రి సీతక్క తనమీద అక్రమంగా కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపణ

రాజేంద్రనగర్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో(Shamshabad Airport) వరంగల్ సుబెదారి పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ మైనింగ్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క తన మీద అక్రమ కేసులుబనాయిస్తున్నారని అయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కేసులకు భయపడే వాడిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టిన ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని ఆయన పేర్కొన్నారు. పాడి కౌశిక్ రెడ్డి విదేశాలకు పారిపోతుండగా అరెస్టు చేసినట్లు సమాచారం.