తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మర్చారు: కవిత
09-12-2024 02:08 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మర్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను మాయం చేసి విగ్రహాంలో తెలంగాణ ప్రత్యేకత లేకుండా చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లికి నివాళులర్పించే అర్హత లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మధ్య రహస్య స్నేహం ఉందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ ముందు నిరసన చేపట్టారు. అదానీ, రేవంత్ రెడ్డి ఫొటోతో టీ షర్లులు ధరించి అసెంబ్లీ వెళ్లిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.






