వారికి తెలంగాణ తల్లిపై గౌరవం లేనట్లే: డిప్యూటీ సీఎం
09-12-2024 02:10 PM
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం, ప్రతిపక్ష సభ్యులు రెండూ అభిప్రాయాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదైనా అంశాన్ని సభలో పెట్టినప్పుడు సభ్యులు అభిప్రాయాలు చెప్పాలని కోరారు. అదే నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ప్రభుత్వం నమ్ముతుందన్నారు. తెలంగాణ తల్లిపై గౌరవం ఉంటే సభలో అభిప్రాయాలు చెప్పాలని, సభ్యులు అభిప్రాయం చెప్పకపోతే తెలంగాణ తల్లిపై గౌరవం లేనట్లేనని విమర్శించారు.






