9 April, 2026 | 2:42 AM

ఉద్యమకారులను విస్మరించిన బీఆర్‌ఎస్

09-04-2026 12:47 AM

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆందోళన

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను బీఆర్‌ఎస్ పార్టీ విస్మరించిందని, తమ హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారులను అణగదొక్కేందు కు ప్రయత్నిస్తున్నారని ఉద్యమకారు ల జేఏసీ సభ్యులు ఆరోపించారు. బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నిం చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పలువురు సభ్యులు తెలంగాణ భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోగా ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకొని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అదనపు బలగాలను రప్పించి భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో జేఏసీ నేతలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన బాధ్యతను బీఆర్‌ఎస్ మరిచిందని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.