9 April, 2026 | 2:43 AM

రామప్ప శిల్పకళ అద్భుతం

09-04-2026 12:48 AM

ఎం.సి.హెచ్.ఆర్.డి శిక్షణ అధికారులు

వెంకటాపూర్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): మండలంలోని ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయం శిల్పకళ అద్భుతమని ఎం.సి.హెచ్.ఆర్.డి శిక్షణలో ఉన్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ప్రశంసించారు. బుధవారం భారత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న అధికారులు రామప్ప దేవాలయాన్ని సందర్శించి దర్శించుకున్నారు.

 సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించారు. కాకతీయుల కాలానికి చెందిన ఈ దేవాలయం నిర్మాణ శైలి, సున్నితమైన శిల్పాలు అధికారులను ఆకట్టుకున్నాయి. పర్యటనలో భాగంగా అధికారులు రామప్ప చెరువును కూడా సందర్శించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్, ఆర్‌ఐ రమేష్, టూరిజం సిబ్బంది, టూరిస్ట్ పోలీసులు బద్రు, శ్రీకాంత్, కోర్స్ డైరెక్టర్ కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్తో పాటు పోలీస్, రెవెన్యూ, పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బందిలు పాల్గొన్నారు.

రామప్పను సందర్శించిన సినీనటుడు

రామప్ప దేవాలయాన్ని సినీనటుడు పులి రాజేందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఇటీవల విడుదలైన సలార్, దేవర సినిమాల్లో విలన్గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టూరిజం గైడ్ దేవాలయ చరిత్ర, శిల్పకళ విశిష్టతలను వారికి వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు.