అపార్ట్‌మెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
09-04-2026 12:46 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): నేర నియంత్రణ కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రతి అపార్ట్మెంట్లో యాజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పట్టణ సీ ఐ మహేందర్ రెడ్డి కోరారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 26వ వార్డులో గల యాదాద్రి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు. ఇదేవిధంగా అపార్ట్మెంట్ యజమానులంతా సీసీ కెమెరాలు ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ ఐ షాకీర్ పాల్గొన్నారు.




