11 March, 2026 | 3:58 PM

Breaking News

విమానంలో 133 మంది ప్రయాణికులు.. ఎయిరిండియాకు తప్పిన ముప్పు   •   భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు   •   ప్రాణం తీసిన చేపల వేట.. కృష్ణా నదిలో గల్లంతైన అన్నదమ్ములు   •   భూ మాఫియా చేసింది మీరే.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు   •   అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు   •   పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి   •   గాంధీభవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ కీలక సమావేశం   •   ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •  

బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం

30-11-2025 05:19 PM

గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించాలని తీర్మానం..

గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలి..

మండలాధ్యక్షులు నరసింహ..

సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిక్షం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిధులుగా మండలాధ్యక్షులు నరసింహ పాల్గొని మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థులుగా పార్టీకోసం కష్టపడ్డ కార్యకర్తలకే టిక్కెట్లు కేటాయిస్తామని, గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించారు. గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించాలని తీర్మానం చేస్తున్నట్లు కలిసి కట్టుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.