16-10-2025 12:00:00 AM
స్థానిక ఎన్నికల ముందు ఆ పార్టీ శ్రేణుల్లో కలవరం
అలంపూర్, అక్టోబర్ 15:గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 12 మె జారిటీ అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నడిగడ్డ ప్రాంతమైన గ ద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు మా త్రం బిఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టి ఎ మ్మెల్యేలుగా గెలిపించుకుని రాష్ట్రం, ఉమ్మడి పాలమూరులో ఆ పార్టీ కాస్త గౌరవం దక్కించుకుంది.
అందులో గద్వాల ఎమ్మెల్యే ఇ ప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు పలువురు చర్చించుకున్న సంగతి విధితమే. ఇక ఉమ్మ డి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న అలంపూ ర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయుడు గెలిపించుకొన్నారు. అయి తే ఇప్పటివరకు బిఆర్‌ఎస్ పార్టీకి పనిచేసిన నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా... మరికొందరు చేరెందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అలంపూర్ నియోజకవర్గంలోనే అత్యంత జనాభా కలిగిన అయిజ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ కండు వా కప్పుకున్నారు. అదే పంథాలోనే మరికొందరు కీలక నాయకులు వెళ్తున్నట్లు తెలు స్తోంది.
గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి అనుచరులైన భూం పురం నరసింహారెడ్డి, ఉప్పల తిప్పన్న సం పత్ కుమార్ స మక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.అదే దారిలోనే బుధవారం అయిజ మండలం మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సంకాపు రం రాముడు, మాజీ జెడ్పిటిసి పులికల్ చి న్న హనుమంత్, సింధనూర్ బ్రహ్మయ్య, శ్రీనివాస్ గౌడ్ ,కృష్ణ ఇతర ము ఖ్య నాయకు లు హైదరాబాదులో సంపత్ కుమార్ నివాసంలో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ కండు వాకప్పుకునేందుకు నిర్ణయించుకుని తమ అభిప్రాయాలను వ్యక్తప రిచినట్లు తెలిసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ముందు బి ఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరెందుకు సిద్ధమవడంతో ఆ పార్టీలో తీవ్ర ఆం దోళనకర పరిస్థితిలో నెలకొన్నాయి.రానున్న స్థానిక ఎన్నికల్లో తెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు నా యకులు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఎమ్మెల్సీ, ఎమ్మె ల్యే ఇలాక లోనే ఆ పార్టీకి చెందిన నాయకు లు కాంగ్రె స్ పార్టీలో చేరడం ఒకింత ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. జూ బ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సం స్థల ఎన్నికల ముందు పలువురు బిఆర్‌ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ప్రజల దృష్టి అధికార పార్టీకి వైపుకు మళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.