calender_icon.png 16 October, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు

16-10-2025 12:00:00 AM

పదర, అక్టోబర్ 15: పదర మండల కేంద్రానికి చెందిన అయ్యప్ప భక్తులు అచ్చంపేట మండల ఉమామహేశ్వరం దేవాలయంలో బుధవారం గురు స్వాములు మండి అంజయ్య, పాండు, చారి ఆధ్వర్యంలో సుమారు 40 మందిపైగా భక్తులు భక్తిశ్రద్ధలతో మాల ధారణ చేశారు.

ఈ సందర్భంగా స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో ఆలయం మార్మోగింది. అనంతరం స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాలధారణ వేసిన స్వాములకు నియనిబంధనలతో ఉండాలని భక్తులకు గురుస్వామి మండి అంజయ్య యాదవ్‌సూచించారు.