30-01-2026 12:10:20 PM
భారీగా నిలిచిన వాహనాలు
సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట మండలంలోనీ జక్కాపూర్ గ్రామం వద్ద గల సిద్దిపేట సిరిసిల్ల రహదారిపై మండలంలోని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేశారు. మాజీ సీఎం కెసిఆర్ సిట్ నోటిస్ లు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ జక్కాపూర్ గ్రామం వద్ద సిద్దిపేట సిరిసిల్ల రహదారి పై బైటాయించిన బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు. సీఎం రేవంత్ రెడ్డి హామీలు గాలికి వదిలేసి రాజకీయ కక్షతో తెలంగాణ తెచ్చిన నాయకుల పై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ కి నోటిస్ ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు.